Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts
Saturday, 9 April 2016
Rani Rudrama Devi
Monday, 21 March 2016
నీరు ప్రాముక్యత
నీరు, ఉదకం లేదా జలము (సాంకేతిక నామం H2O) జీవులన్నింటికి అత్యవసర పదార్ధం. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రధమ జీవి పుట్టుక నీటినోనె జరిగినది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో వున్నది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి
telugu kavulu
మన కవులు
కావ్యాలు తాము పుట్టిన కాలం యొక్క సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయి. నాటి ఆచార వ్యవహారాల గురించి సమగ్రంగా వివరిస్తాయి. జాతి జీవన పురోగతికి ఇవి దిశా నిర్దేశాలు కావడంతో వాటిని ప్రజలు అనుసరిస్తుంటారు. ఆచారాలు ఎప్పటివైనా, వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకుంటూ, కొత్త పోకడలను రూపుదిద్దుకుంటూ సాగుతారు. ఇది చరిత్రలో ఓ అంతర్భాగం. ఆ చరిత్ర గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కావ్య పఠనం తప్పనిసరి. అందుకే జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే కావ్యాల గురించి తెలుసుకున్నట్టే కావ్య రచనా కర్తలైన కవుల గురించి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఆంధ్ర జాతికి అక్షర రూపంలో అంతులేని విజ్ఞానాన్ని అందించిన కవుల వివరాలను అందిస్తున్నాం.
అలెగ్జాండర్ గ్రాహంబెల్
బాల్యము
గ్రహంబెల్ మార్చి 3, 1847 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే గడిచింది. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ క్షయ వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్.
టెలిఫోన్ ఆవిష్కరణ
గ్రాహంబెల్ తాత, తండ్రి వక్తృత్వం, సంభాషణల విషయాలపై పరిశోధన చేస్తుండేవారు. ప్రాథమిక విద్యను తండ్రి వద్దే అభ్యసించిన గ్రాహంబెల్ ఎడింబరోలోని రాయల్ హైస్కూల్లో చదువుకుని, పదహారేళ్లకల్లా అక్కడే వక్తృత్వం, సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో
థామస్ అల్వా ఎడిసన్
ఏ వ్యక్తి అయినా ఏక కాలంలో వందల కొద్దీ ఆవిష్కరణలను కొనసాగించలేడు. అందునా శాస్త్రీయ ఆవిష్కరణలంటే సామాన్యమైన విషం కాదు. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ విషయం వేరు. 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉండటం ఆయన ఒక్కడికే చెల్లింది. 1889 లో పారిస్ లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్ కు చెందినవే కావటం ఆశ్చర్యకరం. ఇంత ప్రతిభా వుత్పత్తులను ప్రదర్శించినవారు మరొకరు లేరని, అసలు ఉండరని చెప్పడానికి సందేహమే అవసరంలెదు.
థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.
బాల్యం,విద్యాభ్యాసం
Subscribe to:
Posts (Atom)